ఢిల్లీలో న్యాయముర్తినే అపహరించబోయిన క్యాబ్ చోదకుడు

SMTV Desk 2017-11-28 14:53:04  delhi, Woman judge, police

న్యూఢిల్లీ, నవంబర్ 28 : మహిళలకు రక్షణ కరువైన ఢిల్లీలో ఈసారి ఏకంగా మహిళ న్యాయమూర్తిని ఓ క్యాబ్‌ చోదకుడు అపహరించబోయి పోలీసులకు చిక్కాడు. క్యాబ్‌ డ్రైవర్‌ తాను చెప్పినట్టు కర్‌కర్‌దూమా కోర్టుకు కాకుండా జాతీయ రహదారి -24పై ఉన్న హపూర్‌ వైపు కారును మళ్లించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో న్యాయమూర్తి వెల్లడించారు. వాహనాన్ని వేగంగా మరోవైపు పోనిస్తుండగా ఆమె వెంటనే సహచరులకు, పోలీసులకు సమాచారం అందించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్‌ మళ్లీ దిల్లీకి యూ-టర్న్‌ తీసుకున్నాడు. కారును వెంబడించిన పోలీసులు ఘాజిపుర్‌ టోల్‌ప్లాజా వద్ద డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. దేశ రాజధానైన ఢిల్లీలో మహిళలపై అత్యాచార, అపహరణ, హత్యాయత్నాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి కాకుండా ఇంకా కట్టుదిట్టమైన భద్రతను ప్రభుత్వం పెట్టడం క్షేమదాయకం.