హెల్మెట్ లేదని పోలీస్ అమానుషం

SMTV Desk 2017-11-25 16:43:23  police, ruth less action, tamilnadu, kanyakumari

చెన్నై, నవంబర్ 25 : సాదారణంగా మనం హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే, పోలీసులు జరిమానా వేస్తారు...! లేకపోతే మరోసారి ఇలా చేయవద్దని హెచ్చరిస్తారు... కానీ తమిళనాడులో శిరస్త్రాణం ధరించలేదని ఓ వ్యక్తిని పోలీసు విచక్షణ రహితంగా తలపై లాఠీతో కొట్టాడు. వాహనాల తనిఖీలలో భాగంగా కన్యాకుమారిలోని ఓ రోడ్డుపై, ఇద్దరు వ్యక్తులు శిరస్త్రానం ధరించకుండా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఇది గమనించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ వారిపై లాఠీతో విరుచుకుపడ్డాడు. వాహనం నడుపుతున్న వ్యక్తి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. భాదితుడిని చికిత్సనిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాధితుడి స్నేహితులు, బంధువులు ఆందోళనకు దిగారు.