మిర్యాలగూడ లో దారుణం...

SMTV Desk 2018-09-15 15:02:53  pranay murder, realtor maruthi rao, miryalaguda

మిర్యాల గూడ: ఓ తండ్రి మూర్ఖత్వానికి నిండు ప్రాణం బలైంది తన కూతిరిని ప్రేమ వివాహం చేసుకున్నాడని అల్లుడిని కిరాయి హంతకుల చేత చంపించిన ఘటన హైదరాబాద్ మిర్యాల గూడ లో చోటు చేసుకుంది, హతుడు దళిత సంఘానికి చెందిన వాడు కావడం తో మిర్యాల గూడ లో బంద్ పాటిస్తూ నిరసనలకు దిగారు. ఒకే కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన ప్రణయ్, అమృతలు ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు, ఇది ససేమిరా ఇష్టం లేని అమృత తండ్రి రియల్టర్ మారుతి రావు 10 లక్షలు సుపారీ ఇచ్చి ప్రణయ్ ని హత్య చేయించాడు అని బందువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు, అయితే నాలుగు నెలల గర్బవతి అయిన అమృతని ఈ నెల 14 న హాస్పిటల్ లో చెకప్ కోసం తీసుకు వెళ్తున్న సమయం లో వెనక నుండి వచ్చిన దుండగుడు కత్తితో ప్రణయ్ పై దాడికి పాల్పడ్డాడు ఈ దాడి లో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రణయ్ కుటుంబాన్ని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పరామర్శించారు.