బాలికపై సామూహిక అత్యాచారం.

SMTV Desk 2018-03-25 15:57:58  Minor, Girl gangrarped,kirosine, death

గువాహటి, మార్చి 25 : అస్సాంలో దారుణం జరిగింది. పన్నెండేళ్ల మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాగామ్‌ జిల్లాలోని ధానియాభేటి లాలుంగ్‌ గాన్‌లో ఐదో తరగతి చదువుతున్న బాలిక(12) ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని నాగామ్‌లోని ఆస్పత్రికి తరలించగా శనివారం ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లు, బాధితురాలితో కలసి చదువుకుంటున్నవారే. బాలిక వాంగ్మూలం ఆధారంగా ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు.