ఇద్దరు నకిలీ హిజ్రాలకు దేహశుద్ధి..!

SMTV Desk 2018-03-11 12:00:16  fake hijras, caught and taken away, in aler.

ఆలేరు, మార్చి 11 : ఇద్దరు నకిలీ హిజ్రాలకు దేహశుద్ధి చేసిన సంఘటన యాదాద్రి జిల్లా ఆలేరులో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన కె.యాదగిరి, కె.మల్లేశ్‌ హిజ్రాల అవతారమెత్తి వివిధ ప్రాంతాల్లో పైసలు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అసలు హిజ్రాలు కొంతకాలంగా వీరిని పట్టుకోవాలని చూస్తున్నారు. ఆలేరులోని ఒక ఫంక్షన్‌హాలు వద్ద వీరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకుని ఇద్దరిని చితకబాదారు. తర్వాత ఆలేరు పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇలాంటి నకిలీ హిజ్రాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని హిజ్రాలు వాపోయారు.