మృగాళ్ల వేటకు దూకిన తల్లీకూతుర్లు...

SMTV Desk 2017-11-13 18:18:17  Uttar Pradesh Kanpoor, mother Daughter, attack, rain

కాన్పూరు, నవంబర్ 13 : ఉత్తరప్రదేశ్ కాన్పూరులో దారుణం జరిగింది. కామందుల బారిన పడకుండా రైలు నుంచి తల్లి, కూతురు ఇద్దరు దూకడంతో, ఈ ఘటనలో వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన కథనం ప్రకారం..హౌరా-జోద్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి కూతురుతో కలిసి తల్లి కోల్‌కతా నుంచి ఢిల్లీకి వస్తుండగా ముగ్గురు ఆగంతకులు తమను వేధించడంతో, ఈ ఘటనపై బాలిక తల్లి మొదట ఫిర్యాదు చేశారు. అలహాబాద్‌ రైల్వే పోలీసులకు ఓసారి, అలహాబాద్‌ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత మరోసారి ఫిర్యాదు చేయడంతో బోగీలో వారికి రక్షణగా రైల్వే కానిస్టేబుళ్లు కొంత దూరం వచ్చారు. అల్లరి చేస్తున్న వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. పోలీసులు వెళ్లిపోయాక 30 నిమిషాల అనంతరం దుండగులు మరోసారి తల్లీకూతుళ్ల వైపుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారన్న ఆగ్రహంతో ఈసారి మరింత క్రూరంగా ప్రవర్తించారు. టాయిలెట్‌ వైపు వెళ్తున్న కూతురిపై దాడి చేసి అత్యాచారానికి యత్నించారు. కూతురి కేకలు విన్న మహిళ వారిని అడ్డుకోవడానికి యత్నించింది. చివరికి వారి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి దారి లేక ఆ రైలు నుంచి కూతురితో కలిసి దూకేసింది. రైలు నుంచి దూకిన రెండు గంటల అనంతరం వారు గాయాలతో సమీపంలోని చాందారీ స్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి వారిని లాలా లజ్‌పత్‌ రాయ్‌ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, పైగా డబ్బులు తీసుకొని నిందితులను వదిలేశారని బాధితురాలు ఆరోపించింది.