పోరయార్ లో ఘోర ప్రమాదం....

SMTV Desk 2017-10-20 20:11:11  Poriyar in Nagapattinam district thamilanadu, road accident

తమిళనాడు, అక్టోబర్ 20 : నాగపట్నం జిల్లాలోని పోరయార్ లో శుక్రవారం తెల్లవారుజామున టీఎన్ఎస్‌టీసీ(తమిళనాడు స్టేట్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్)కి చెందిన బస్సు గ్యారేజీ భవనం కూలిపోయింది. రాత్రి పూట విధులు పూర్తి చేసుకొని సిబ్బంది విశ్రా౦తి తీసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. సంఘటనపై తమిళనాడు ప్రభుత్వం స్ప౦దించి...బాధిత కుటు౦బలకు అండగా ఉంటామని మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, రూ. 7.5 లక్షల సాయం అంది౦చనున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 1.5 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు.