ఐటం సాంగ్స్ ను నిషేదించాలి : కంగనా

SMTV Desk 2018-04-05 17:37:07  bollywood actress, Kangana Ranaut, item songs.

ముంబై, ఏప్రిల్ 5 : బాలీవుడ్ "క్వీన్" కంగనా రనౌత్ ఐటం సాంగ్స్ ను నిషేదించాలని కోరింది. ఇలాంటి పాటలు సమాజంపైనా, పిల్లల పైనా చెడు ప్రభావం చూపిస్తున్నాయని అందుకే అలాంటి పాటలలో నర్తించనని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. “ఐటం సాంగ్స్ నేను చేయను. అవి చాలా అశ్లీలంగా ఉన్నాయి. నిజానికి ఐటం సాంగ్స్ ను నిషేధించాలని నా అభిప్రాయం. అవన్నీ పిల్లపైన చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. పిల్లల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. రేపు నా పిల్లల్ని కూడా అలాంటి పేర్లతో పిలవాలా.?” అంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం కంగనా వీర నారి ఝాన్సీ రాణి జీవిత చరిత్ర "మణికర్ణిక.. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ" చిత్రంలో నటిస్తోంది.