మొత్తానికి రియల్ లైఫ్ హీరో అయ్యాడు..

SMTV Desk 2018-04-03 16:23:11  bollywood actor, akshay kumar, toilet constructions, 10 lakhs.

ముంబై, ఏప్రిల్ 3 : విభిన్నమైన పాత్రలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. ఖాళీ సమయం దొరికితే నిత్యం సామాజిక సేవలలో బిజీగా గడుపుతుంటారు. తాజాగా అక్షయ్.. ముంబైలోని జుహు బీచ్ వద్ద రూ.10 లక్షలు ఖర్చు చేసి టాయిలెట్‌ని ఏర్పాటు చేయించాడు. అక్షయ్ "టాయిలెట్" చిత్రం విడుదలైన తరువాత రోజు అతని భార్య ట్వింకిల్ ఖన్నా జుహు బీచ్ వద్ద వాకింగ్‌కి వెళ్లింది. అక్కడ ఓ యువకుడు బహిరంగ మల విసర్జన చేస్తుండగా.. ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో అక్షయ్.. టాయిలెట్ కట్టించాలని నిర్ణయించుకొన్నారు. అనుకున్నదే ఆలస్యం రూ. 10 లక్షలు ఖర్చు చేసి టాయిలెట్‌ని నిర్మించారు. దీనికి శివసేన నేత ఆదిత్య థాకరే కూడా ఆర్థిక సాయం చేశారు.