పేరున్న దర్శకుడిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

SMTV Desk 2018-04-03 12:35:31  actor srireddy, facebook comments, famous director,

హైదరాబాద్, ఏప్రిల్ 3 : సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే.. కష్టపడాల్సిందే. కోటి కష్టాలు కూటి కోసమే అన్నట్లు.. కష్టపడక తప్పదు. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అందరు కష్టపడి పైకి వచ్చిన వారే. అలాంటిది ప్రస్తుతం ఈ మధ్య కాలంలో వస్తున్న కామెంట్స్ ను చూస్తుంటే.. హీరోయిన్స్ అందరు క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నారు అనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సినీ ప్రపంచం తెర వెనుక రహస్యాలను బయట పెడుతూ వస్తోంది. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక దర్శకుడి గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ దర్శకుడి గురించి ఈ విధంగా స్పందించింది. "పెద్ద డైరెక్టర్ అని పొగరు.. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికి రారు అని అతడి ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్క పీచు సోగ్గాడు. వూదితే ఎగిరిపోయే ఇతనికి భయం బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసుకుంటాడు పాపం. మేల్ ఆర్టిస్టుల దగ్గరా డబ్బులు గుంజుతాడని టాకు. వారెవరో కాదు.. కొమ్ములు వచ్చిన శేఖరుడు" అంటూ పోస్ట్ చేసింది. ఇంతకి శ్రీరెడ్డి చెప్పేది ఏది నిజమో.. ఏది అబద్దమో.. మాత్రం ఎవ్వరికి తెలియదు.