సమ౦త.. సరికొత్త రూల్..

SMTV Desk 2018-04-03 11:59:10  samantha, rangasthalam, director sukumaar,

హైదరాబాద్, ఏప్రిల్ 3 : టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతూ బాక్స్ ఆఫీస్ ను హిట్స్ కొట్టేస్తోంది హీరోయిన్ సమ౦త. సాధారణంగా చాలా మంది తారలు పెళ్లి కాగానే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు. కాని సమ౦త అలా కాదు.. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఒక రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అందుకొని ఒక ప్రత్యేకమైన గుర్తింపును సమంత సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన 13 సినిమాలు 1 మిలియన్ క్లబ్ లో చేరాయని దర్శకుడు సుకుమార్ వెల్లడించారు. "రంగస్థలం" చిత్రంలో రామలక్ష్మి పాత్రకు ఆమె న్యాయం చేయగలదా అని అంతా అనుకున్నారు కానీ.. సమ౦త ఆమె పాత్రకు న్యాయం చేస్తుంది. ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆ నమ్మకాన్ని సమ౦త నిజం చేసింది.. అందుకే రామలక్ష్మి పాత్ర అంత గొప్ప హిట్ అయ్యిందన్నారు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన హీరోయిన్ అనే ఇమేజ్ కి ఎలాంటి డోకా లేదని.. సమ౦త ఒక కొత్త రూల్ తీసుకొచ్చిందని సుకుమార్ చెప్పుకొచ్చారు.