ఈ సినిమాలో నేను బరువు పేరుగాను : కీర్తి సురేష్

SMTV Desk 2017-06-30 19:28:03  keerthi suresh, nenu sailaja, nanu local, savitri

హైదరాబాద్, జూన్30 : తెలుగు సినిమా పరిశ్రమలోని అందాల ముద్దుగుమ్మ "కీర్తి సురేష్ " ప్రస్తుతం ఒక కొత్త సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సావిత్రి జీవిత కథ ఆధారంగా తీయనున్నారు. దీని పేరు "మహానటి" గా నిశ్చయించారు. దీనిలో ఈ ముద్దుగుమ్మ సావిత్రి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్ర కొంచెం బొద్దుగా ఉంటుంది. దానికిగాను కీర్తి నేను బరువు పెరగను కానీ ఈ సినిమాలో నేను లావుగానే కనిపిస్తాను. తను ఈ సినిమాకై ప్రోస్థటిక్ మేకప్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేకప్ వలన తను సినిమాలో లావుగా కనిపిస్తాదని, రెండు సినిమాలతో ఎంతో పాపులారిటీ సాధించిన "కీర్తి" ఈ సినిమాతో మరింత క్రేజ్ ను సంపాదిస్తానని చెప్పింది.