చరణ్ ను విష్ చేసిన అరవింద్ స్వామి..

SMTV Desk 2018-03-30 14:07:00  ACTOR ARAVIND SWAMY, ARAVIND TWEET TO RAMCHARAN, RANGASTHALAM MOVIE,

హైదరాబాద్, మార్చి 30 : రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన "రంగస్థలం" చిత్రం నేడు విడుదలైంది. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అంతేకాదు విమర్శకుల నుండి హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి.. చరణ్ కు, సినీబృందం మొత్తానికి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. "ఈ సినిమా గురించి ఇప్పటికే మంచి విషయాలు వింటున్నా. రామ్ చరణ్ సహా మిగతా టీం మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్" అంటూ ట్వీట్ చేశారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించగా జగపతిబాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషించారు.