మా ఆయన బెస్ట్ : ఇలియానా

SMTV Desk 2018-03-25 15:30:27  Ileana, Ileana Husband, Andrew Kneebone, Instagram post.

ముంబై, మార్చి 25 : గోవా భామ ఇలియానా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో "మా ఆయన బెస్ట్" అంటూ తన భర్త ఆండ్రూ నీబోన్‌ గురించి ఆసక్తికర విషయాన్ని పోస్ట్ చేసింది. పెళ్లి గురించి మాత్ర౦ వెల్లడించలేదు కాని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హబ్బి అంటూ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటుంది. అయితే గత కొంతకాలంగా ఇలియానా జ్వరంతో బాధపడుతుందట. ఈ క్రమంలో ఆండ్రూనే వంట చేసిపెట్టి దగ్గరుండి చూసుకుంటున్నారట. ఈ విషయాన్ని గోవా బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ.. "ఒంట్లో బాలేనప్పుడు ఆయన దగ్గరుండి నన్ను చూసుకుంటారు. మా ఆయన బెస్ట్‌" అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ ను ఇలియానా.. కుటుంబీకుల సమక్షంలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.