నగరవ్యాప్తంగా క్యాబ్ డ్రైవర్ల సమ్మె..!

SMTV Desk 2018-03-19 17:13:18  ola, uber, cab drivers, protest, hyderabad.

హైదరాబాద్, మార్చి 19 : మా డ్రైవర్లకు తగినంత ఆర్థిక సహాయం అందించాల౦టూ ఓలా, ఉబర్ క్యాబ్ సేవలు నగరవ్యాప్తంగా సమ్మె చేపట్టాయి. క్యాబ్ డ్రైవర్లకు సదుపాయాల మెరుగుదల కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు మహారాష్ట్ర నవ్‌ నిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) సంఘ సభ్యులు తెలిపారు. ఈ సమ్మెలో సుమారు 80,000మందికి పైగా పాల్గొంటారని ఎంఎస్‌ఎస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. "మాది హింసతో కూడిన పోరాటం కాదు. మా డ్రైవర్లకు తగినంత ఆర్థిక సహాయం అందించాలి. ఈ సమ్మె కేవలం ముంబైలోనే కాదు.. నాసిక్‌, పుణె, ఢిల్లీ, బెంగళూరు నగరాలకూ విస్తరిస్తాం. మా దగ్గరి నుంచి అన్ని హామీలు తీసుకునే కంపెనీలు వారి హామీలను నిలబెట్టుకోలేకపోతున్నాయి. మా డిమాండ్ల విషయంలో కంపెనీలు, ప్రభుత్వం తగు చర్యలు తీసుకునే వరకూ మా సమ్మె కొనసాగుతుంది" అని వెల్లడించారు.