రహస్యంగా హీరోయిన్ శ్రియ వివాహం.?

SMTV Desk 2018-03-17 15:23:12  Heroine sriya, marriage, Russian sports man,

ముంబై, మార్చి 17 : ప్రముఖ కథానాయిక శ్రియ శ్రియా శరణ్.. రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె రష్యన్ కు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కోశీవ్ ను వివాహమాడినట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితుల మధ్య ముంబైలో ఉన్న శ్రియ ఇంట్లోనే ఈ పెళ్లి జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలుత ఉదయ్‌పూర్‌లో పెళ్లి జరగనుంది అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన శ్రియ.. ఇంతవరకు తన ప్రేమ, పెళ్లి గురించి ఎటువంటి సందర్భాల్లోనూ వెల్లడించకపోవడం గమనార్హం. కాగా హిందూ సంప్రదాయ ప్రకారం ఈ వివాహం జరిగినట్లు.. శ్రియ గులాబి రంగు చీరలో మెరిసిపోయింద౦టూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులకు స్వస్తీ చెప్పాలంటూ శ్రియ నోరు విప్పే వరకు ఆగాల్సిందే..! ఇటీవల "గాయత్రి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రియ.. "ప్రస్తుతం వీర భోగ వసంత రాయలు" అనే చిత్రంలో నటిస్తోంది.