వారిద్దరు అవార్డుల స్థాయిలో నటిస్తున్నారు : కేవీపీ

SMTV Desk 2018-03-14 18:32:34  kvp ramachandrarao, modi, ap cm chandrababu, congress

హైదరాబాద్, మార్చి 14 : కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు.. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ తమ నటనతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కేవీపీ.. నంది అవార్డు స్థాయి నటనతో చంద్రబాబు నాయుడు.. ఆస్కార్ స్థాయి నటనతో మోదీ.. తమ తమ నటనతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ కోసం నిధులు కావాలంటూ చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపించాలని అడుగుతున్నందువల్లే బీజేపీని వ్యతిరేకిస్తోందని కేవీపీ ఆరోపించారు.