రైతు సమస్యల పరిష్కారానికి కృషి. .

SMTV Desk 2018-03-12 19:09:16  minister ktr, guttha sukhendar reddy, cm kcr.

హైదరాబాద్, మార్చి 12 : రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రకాల విప్లవాలకు నాంది పలికారన్నారు. అందులో భాగంగా రైతు సమన్వయ సమితిలో హరిత విప్లవానికి, అలాగే చేపల పెంపకంతో నీలి విప్లవం, గొర్రెలతో పింక్ విప్లవం, పాల సేకరణ మద్దతు ధర పెంచి క్షీరవిప్లవానికి శ్రీకారం చుట్టారని ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రాష్ట్రంలోని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీలతో కలిసి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా పలువులు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.