లండన్ లో "కట్టప్ప" ఖ్యాతి..

SMTV Desk 2018-03-12 15:22:51  bahubali movie, kattappa, kattappa statue madame tussauds wax museum.

చెన్నై, మార్చి 12 : ప్రపంచవ్యాప్తంగా “బాహుబలి” చిత్రం ఎంత ప్రఖ్యాతి గాంచిందో, ఆ సినిమాలో కట్టప్ప పాత్రకి సైతం అంతే ఖ్యాతి లభించింది. ఈ సినిమాలో ఒక పక్క విశ్వాసానికి నిర్వచనంలా ఉంటూనే.. మరో పక్క తన ధీరత్వంతో రాజవంశాన్ని కాపాడుకుంటాడు. అంతగా ఆకట్టుకున్న ఆ పాత్రను లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ విషయాన్ని సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్ తెలియచేశారు. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం పెట్టిన తొలి తమిళ నటుడిగా సత్యరాజ్ నిలవడం విశేషం.