ఇన్‌స్టాలో సన్నీ సర్‌ప్రైజ్..!

SMTV Desk 2018-03-05 15:41:29  sunnyleon family pic, instagram, adopted childrens.

ముంబై, మార్చి 5 : ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోతో పోర్న్ స్టార్ సన్నీలియోన్ నెటిజన్లను సర్‌ప్రైజ్ చేసింది. ఇదివరకే మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఆమె దత్తత తీసుకొని నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. తాజాగా సన్నీ.. మరో ఇద్దరు మగ పిల్లలను దత్తత తీసుకుంది. వారికి అషర్ సింగ్ వెబర్, నోవా సింగ్ వెబర్ అని పేర్లు పెట్టింది. తన భర్త డానియల్‌ వెబర్ తో పాటు ముగ్గురు పిల్లలతో ఉన్న ఫొటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా తాము చాలా గర్వపడుతున్నామని, ముగ్గురు పిల్లలను పెంచడం సాధ్యమేనని తనకు అనిపించి ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నట్లు తన సందేశంలో పేర్కొంది.