మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్...

SMTV Desk 2018-02-28 10:43:25  HOLI FESTIVAL, WINE SHOPS CLOSED, HYDERAABAD, HOLIDAYS.

హైదరాబాద్, ఫిబ్రవరి 28 : హోలీ పండగను పురస్కరించుకొని నగరంలో నేటి నుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు నేటి సాయంత్రం ఆరు గంటల నుండి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ షాపులు, రిజిస్టర్డ్ క్లబ్బులు, బార్లు, కళ్ళు దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలకు తాళం పడ్డట్టే. ఇదిలా ఉండగా హోలీ పండగ నేపథ్యంలో మార్చి రెండవ తేదీని ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కాని రాష్ట్రం ప్రకటించిన సెలవుల కాలెండర్‌లో సాధారణ సెలవు మార్చి 1గా ఉంది. కేంద్రం మార్చి 2న హోలీ సెలవు ఇచ్చింది. దీంతో రాష్ట్రప్రభుత్వం దేవదాయశాఖను సంప్రదించగా హోలీ సెలవును యథావిధిగా ఉంచుతూనే మార్చి రెండవ తేదీని ఐచ్చిక సెలవుగా గుర్తించింది.