దివికేగిన అతిలోకసుందరి..

SMTV Desk 2018-02-25 10:31:15  actress sridevi, passed away, heart attack, tamil

హైదరాబాద్, ఫిబ్రవరి 25 : అతిలోకసుందరి, ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం చెందారు. దుబాయ్ లో పెళ్లి వేడుకకోసం కుటుంబ సభ్యులతో హాజరైన ఆమె గుండెపోటుతో తుది శ్వాసవిడిచారు. శ్రీదేవి మృతితో యావత్ సినీ ప్రపంచం మూగబోయింది. 1963 ఆగస్ట్ 13 జన్మించిన అందాలతార, 1969 లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి ఆబాలగోపాలాన్ని మెప్పించారు. భారతీయ సినీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నశ్రీదేవి అందర్ని విడిచి వెళ్లిపోవడం తట్టుకోలేని విషయం. ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.