"ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ" లో బిల్‌గేట్స్‌..

SMTV Desk 2018-02-21 13:12:06  MICROSOFT CEO, BILLGATES, IN HOLLYWOOD SERIES, THE BIG BANG THEORY.

లాస్‌ఏంజెల్స్, ఫిబ్రవరి 21 : మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌.. ఓ హాలీవుడ్ చిత్రంలో తళుక్కున మెరవనున్నారు. హాలీవుడ్‌లో పాపులర్‌ అయిన కామెడీ సిరీస్‌ "ది బిగ్‌ బ్యాంగ్‌ థియరీ" సిరీస్‌లో ఆయన అతిథి పాత్రలో నటించనున్నారు. అయితే గేట్స్‌ ఇందులో వేరే పాత్రలో కాకుండా మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే నటించనున్నారు. గేట్స్‌ ఇలాంటి సిరీస్‌లో నటించడం ఇది తొలిసారేం కాదు. గతంలో "ఫ్రాసియర్‌" అనే కామెడీ సిరీస్‌లోనూ అతిథి పాత్రలో నటించారు. కాగా ఈ ఎపిసోడ్‌ను వచ్చే నెల ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాని గేట్స్.. ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పారితోషికం తీసుకోకపోవడం విశేషం.