జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం..

SMTV Desk 2018-02-06 12:51:14  kharaithabad, ghmc, fire accident, hyderabad

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కంప్యూటర్, ముఖ్యమైన దస్తావేజులు, ఫర్నిచర్ ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. మొదటి అంతస్తులోని ఆడిట్ విభాగంలో ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగి సామాగ్రి అంతా దగ్ధమైంది. వెంటనే రెండు అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలును అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.