నీటిపారుదల శాఖకు ఐదేళ్ల బాలుడు ప్రచారకర్త..!

SMTV Desk 2018-02-04 15:34:25  IRRIGATION BRAND AMBASSADOR, 5 YEARS OLD BOY, TELANGANA GOVT, MINISTER HARISH RAO.

హైదరాబాద్, ఫిబ్రవరి 4 : ఐదేళ్ల బాలుడికి తెలంగాణ ప్రభుత్వం ఒక అరుదైన గుర్తింపునిచ్చి౦ది. రాష్ట్ర నీటిపారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఐదేళ్ల బాలుడిని నియమిస్తూ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. యూకేజీ చదవుతున్న నేహాల్.. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పలు సూచనలు, ఆయకట్టుకు చెందిన ఇతర ప్రయోజనాలపై 20 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడి అందరి మన్ననలు పొందాడు. నేహాల్ ప్రతిభ చూసి విస్తుపోయిన మంత్రి హరీష్‌రావు.. నేహాల్ చదువుకయ్యే ఖర్చు మొత్తాన్ని నీటిపారుదల శాఖ భరిస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఆ బాలుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టాడు.