అనుష్కకు రజనీకాంత్ ప్రశంసలు..

SMTV Desk 2018-02-03 17:05:25  BHAGAMATHI, RAJANIKANTH, CONGRATULATE TO ANUSHKA, ASHOK G.

హైదరాబాద్, ఫిబ్రవరి 3 : మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన స్వీటీ అనుష్క.. తాజాగా "భాగమతి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ తో అందరిని భయపెడుతూనే తనదైన శైలీలో రౌద్రాన్ని ప్రదర్శించింది. అశోక్.జి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అటు తెలుగు చిత్రపరిశ్రమ నుండే కాకుండా విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ అనుష్కకు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారట. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనుష్క.. "నటన బాగుందని రజనీకాంత్ చెప్పగానే చాలా సంతోషించా" అని చెప్పుకొచ్చింది. ఇటీవల "భాగమతి" సినిమా చూసి నా భార్య ఉపాసనకు రాత్రంతా నిద్రపట్టలేదు అంటూ హీరో రామ్ చరణ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.