పెళ్లి కూతురు కానున్న కలెక్టర్ ఆమ్రపాలి..

SMTV Desk 2018-01-22 10:48:01  warangal collector, amrapali,

వరంగల్, జనవరి 22 : వరంగల్ అర్భన్ కలెక్టర్ ఆమ్రపాలి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారిని ఆమె పెద్దల సమక్షంలో వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 18న వీరి వివాహం జరగనుంది. దీని కోసం ఈ నెల 27 నుండి కలెక్టర్ ఆమ్రపాలి సెలవులో వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2016 అక్టోబర్ 11 న వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి తనదైన పనితీరుతో వరంగల్‌ను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి పలు అవార్డులు సైతం అందుకున్నారు.