ఎంత నిజాయితీగా ఉన్నామో జనాలకు తెలుసు : కేసీఆర్

SMTV Desk 2018-01-18 16:20:49  kcr, india today conclave, meeting, ap telangana

హైదరాబాద్, జనవరి 18 : ఏపీని, తెలంగాణతో పోల్చడం సరికాదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియాటుడే నిర్వహించిన కాన్‌క్లేవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ భిన్న సంప్రదాయాల సమ్మేళన౦ అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను గుజరాత్‌, సింగపూర్‌తో పోల్చడం సరికాదన్నారు. అలాగే ముస్లిం రిజర్వేషన్లపై ఆయన మాట్లాడుతూ.. 50శాతం కోటా సరిపోవడం లేదన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, భవిష్యత్తులో రైతు ఆత్మహత్యలు ఇక మీదట ఉండబోవని భరోసా ఇచ్చారు. 2020 నాటికి రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. తనకు ఎవరి రాజకీయాలపై ఆసక్తి లేదని, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమన్నారు. మేము ఎంత నిజాయితీగా ఉన్నామో జనాలకు తెలుసు అని, ప్రజలకు విశ్వాసం పెరిగే కొద్దీ నాయకుడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.