చిరుని ఇలా ఎప్పుడైనా చూశారా..!

SMTV Desk 2018-01-13 15:44:56  chiranjeevi, new look, saira narasimhareddy, clean shave

హైదరాబాద్, జనవరి 13: చాలా విరామం తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి అభిమానులను అలరించారు. వెండితెరపై తన క్రేజు ఏ మాత్రం తగ్గలేదని ఆ సినిమాతో చిరు నిరూపించాడు. చిరంజీవి తన 151వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. రెండో షెడ్యూల్ ను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లుక్ కోసం మెగాస్టార్ కొంత కాలంగా గడ్డంతో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన షూటింగ్ లో కూడా చిరు అదే లుక్ లో పాల్గొన్నారు. కానీ తాజాగా మెగాస్టార్ క్లీన్ గా షేవ్ చేసుకొని అభిమానులకు దర్శనమిచ్చారు. జువ్వ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. గడ్డం, మీసం లేకుండా ఇలా కొత్తగా కనిపించారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో గడ్డం లేకుండా కనిపించిన చిరు తరువాత గ్రాఫిక్స్ వర్క్‌ కోసం మీసం కూడా తీసేశారట. రెండో షెడ్యూల్‌ ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉండటంతో ఈ లోగా గ్రాఫిక్స్‌కు కావాల్సిన త్రీడీ ఇమేజెస్ కోసం చిరు ఈ న్యూ లుక్‌ లోకి మారిపోయారని ఫిల్మ్ నగర్ టాక్.