త్వరలో డ్యుయల్‌ సెల్ఫీ కెమెరాతో హెచ్‌టీసీ మొబైల్..

SMTV Desk 2018-01-13 11:18:29  HTC u 11 I, htc,

న్యూఢిల్లీ, జనవరి 13: సరికొత్త ఫీచర్స్ తో మొబైల్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు న్యూ మోడల్ మొబైల్స్ ప్రవేశపెట్టడంలో ప్రముఖ మొబైల్‌ సంస్థ హెచ్‌టీసీ ముందుంటుంది. ఈ నూతన సంవత్సరంలో తొలి స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ యు11ఐ పేరుతో జనవరి 15న విడుదల చేయనుంది. భారీ స్క్రీన్‌, డ్యుయల్‌ సెల్ఫీ కెమెరాలతో లాంచ్‌ చేయనున్న ఈ డివైస్‌ను మిడ్‌ సెగ్మెంట్‌ బడ్జెట్‌ ధరలోనే (రూ.32వేలు) కస్టమర్లకు అందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్‌, రెడ్‌, సిల్వర్‌ రంగుల్లో లభ్యం కానుంది. హెచ్‌టీసీ యు11ఐ ఫీచర్లు ఇలా... # 6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, సూపర్ ఎల్‌సీడీ3 # 1080 x 2160 పిక్సెల్‌ రిజల్యూషన్‌ # స్నాప్‌ డ్రాగన్ 652 ప్రాసెసర్ # ఆండ్రాయిడ్ నౌగట్‌ # 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ # డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా # 3,930ఎంఏహెచ్‌ బ్యాటరీ