మేడ్చల్ లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహన౦..

SMTV Desk 2018-01-12 15:20:32  fire accident, medchal, hyderabad, medipalli,

హైదరాబాద్, జనవరి 12: నగర శివారులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఈ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సిలిండర్ లారీతో పాటు ఆయిల్ ట్యాంకర్, ఒక ద్విచక్ర వాహనం దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడినట్లు సమాచారం. భారీ మంటల కారణంగా ఘటన స్థలానికి ఫైరింజన్లు కూడా చేరుకోలేకపోతున్నాయి. ఈ ప్రమాదం కారణ౦గా అక్కడి చుట్టూ పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెట్రోల్ కంపెనీ నుంచి బయటికి వచ్చాక ప్రైవేట్ గొడౌన్ లో పెట్రోల్ దొంగిలిస్తూ౦డగా ఈ ప్రేలుడు సంభవించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.