ఈనెల 11, 12వ తేదీల్లో జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు...

SMTV Desk 2018-01-11 14:10:02  Special trains to Jana Sathur on 11, 12th, sikrindrabad

సికింద్రాబాద్, జనవరి 11 : ప్రయాణికులకు దక్షిణమధ్యరైల్వే తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీ ఎక్కువ ఉన్నందున రిజర్వేషన్‌ అవసరంలేని, పూర్తిగా 2వ తరగతి జనరల్‌ బోగీలతో జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు, విజయవాడల మీదుగా కాకినాడకు ఈనెల 11, 12వ తేదీల్లో నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు వెల్లడించారు. ఈ జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లన్నీ పూర్తిగా 2వ తరగతి జనరల్‌ బోగీలతో ఉంటాయని వారుతెలిపారు. సికింద్రాబాద్‌-కాకినాడటౌన్‌ జనసాధారణ్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07050) జనవరి 11, 12వ తేదీల్లో రాత్రి 11.10గంటలకు సికిందాబ్రాద్‌ నుంచి బయల్దేరి, కాకినాడ టౌన్‌కు మరుసటిరోజు ఉదయం 11గంటలకు చేరుతుంది. ఈ రైళ్లు 16 జనరల్‌ 2వ తరగతి బోగీలు, 2 లగేజీ కం బ్రేక్‌ వ్యాన్‌ బోగీలను కలిగి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.