భూగర్భ జలాలను కాపాడుకుందాం : కేటీఆర్

SMTV Desk 2018-01-06 16:28:17  it minister ktr, mana nagaram program, dinage system, water issue.

హైదరాబాద్, జనవరి 6 : భూగర్భ జలాలను కాపాడుకుందామంటూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లిలో జరిగిన "మన నగరం" కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్లు వేసి భవనాలు నిర్మించినంత మాత్రాన హైదరాబాద్ విశ్వనగరం కాదని, నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం కూడా ఎంతో కావాలన్నారు. రూ.3100 కోట్లతో త్వరలోనే మునిసిపాలిటీల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం జరగనుందన్నారు. అలాగే ప్రతి ఇంటికి "జలం-జీవం" అనే కార్యక్రమం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నామని పేర్కొన్నారు.