దొంగ చేతికే తాళాలు ఇచ్చారు-బొత్స

SMTV Desk 2017-06-20 12:25:33  YSRCP, Botsa Satyanarayana,TDP,BJP

హైదరాబాద్, జూన్ 20 : వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ .. విశాఖ భూ అక్రమాలపై సిట్ దర్యాప్తును ఆదేశించిన ప్రభుత్వం తీరు చూస్తుంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లుగా ఉందని విమర్శించారు. సిట్ విచారణతో లాభం లేదని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును జరిపించినట్లయితే దీనిలో ఎవరు ముఖ్యపాత్ర పోషిస్తున్నారో వారి వివరాలు ప్రజలందరికీ తెలుస్తాయని ఆయన తెలిపారు. భూ ఆక్రమణలను ఓ వైపు తక్కువ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే మరోవైపు సిట్ వేయడం చూస్తుంటే ఈ అంశంపై ప్రజలతో పాటు మంత్రులు, టీడీపీ భాగస్వామి అయిన బీజేపీ నేతల్లో కూడా అనేక అనుమానాలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు.