ట్విటర్ లోకి వర్మ రీఎంట్రీ...

SMTV Desk 2018-01-02 17:20:56  rgv, pawan kalyan, rgv twitter, agnathavasi.

హైదరాబాద్, జనవరి 02: సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గతేడాది మే 27న చివరిగా ట్విట్ చేస్తూ.. ఇకపై పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా స్పందిస్తానని చెప్తూ ట్విటర్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వర్మ ట్విటర్ వేదికగా... “ట్విటర్‌ అజ్ఞాతవాసంలోకి వెళ్లిన నేను పీకే (పవన్‌కల్యాణ్‌) ‘అజ్ఞాతవాసి’తో స్ఫూర్తి పొంది మళ్లీ వచ్చా” ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా ట్విట్ చేశారు. “సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన తీరు, ఆ క్షణం ఆయనలో కనిపించిన పవర్‌ను ఇప్పటి వరకు ఆయనలో ఎప్పుడూ చూడలేదు. నా అంచనా ప్రకారం తమిళనాడులోని ప్రతి ఒక్కరు ఆయనకే ఓటు వేస్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ పోటీ చేయాలి అనుకున్నా అది మూర్ఖత్వం అవుతుంది” అని వర్మ తన భావాన్ని వ్యక్త పరిచారు.