‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ విడుదల..

SMTV Desk 2018-01-01 19:15:10  NAA PERU SURYA NAA ILLU INDIA, FIRST IMPACT, ALLU ARJUN, VAKKANTAM VAMSI

హైదరాబాద్, జనవరి 1 : మెగా ఫ్యామిలీలో ఒకరైన అల్లు అర్జున్ సినీ పరిశ్రమలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. తన నటన, డ్యాన్స్ తో స్టైలిష్ స్టార్ అభిమానులను ఉర్రుతాలుగిస్తున్నాడు. కాగా ఆయన సైనికుడిగా నటిస్తున్న చిత్రం ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ప్రముఖ కదా రచయిత వక్కంతం వంశీ దర్శకునిగా తొలి చిత్రంకాగా, హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తుంది. నూతన సంవత్సర సందర్భంగా అభిమానులకు కానుకగా ఈ సినిమా ఫస్ట్‌ ఇంపాక్ట్‌ను ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేశారు. ‘నువ్వు ఎవరు’ అనే డైలాగ్‌తో ఫస్ట్‌ ఇంపాక్ట్‌ ప్రారంభమైంది. ‘నేను సోల్జర్‌’ అని బన్ని సమాధానం ఇచ్చారు. ఈ ఫస్ట్ ఇంపాక్ట్ లో అల్లు అర్జున్ సైనిక అధికారిగా కనిపించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా చివర్లో ఇలాగైతే ‘చచ్చిపోతావురా’ అని రావు రమేశ్‌ అంటుంటే.. ‘చచ్చిపోతా గాడ్‌ఫాదర్‌. కానీ, ఇక్కడ కాదు, బోర్డర్‌కు వెళ్లి చచ్చిపోతాను’ అని బన్ని సమాధానం ఇవ్వడం చూస్తుంటే దేశమంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది. ఇంతవరకు అల్లు అర్జున్ చేసిన పాత్రల కంటే ఇందులో అతని హావభావాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై నాగేంద్రబాబు, శ్రీధర్‌ లగడపాటి నిర్మిస్తున్నారు. అర్జున్‌, బ్రహ్మానందం, ఆర్‌. శరత్‌కుమార్‌, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ ‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.