జనవరిలో పాల డైయిరీని సందర్శించనున్న తలసాని

SMTV Desk 2017-12-31 14:04:08  vijaya dairy milk plant, thalasani Srinivasayadev is the Minister of Agriculture

హైదరాబాద్, డిసెంబర్ 31 : పాల అమ్మకాలు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. విజయ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడం పై తలసాని ధ్వజమెత్తారు. శనివారం సచివాలయంలో పాడి పరిశ్రమపై డెయిరీ డెవల్‌పమెంట్‌ సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, పశుసంవ ర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నిర్మలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ...కల్తీలేని, నాణ్యమైన పాలను మార్కెట్‌లో విక్రయిస్తున్నా ఇందుకు పాల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అధికారులను ప్రశ్నించారు. అలాగే, విజయ డెయిరీ కి పాలు పోసే రైతులతో పాటు కరీంనగర్‌, మదర్‌, ముల్కనూరు డెయిరీలకు పాలుపోసే 2.17 లక్షల మంది రైతులకూ లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. దీని కోసం రూ.125 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఈ మేరకు కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, జనవరి రెండో వారంలో డెయిరీని సందర్శించి, తగ్గిన చర్యలు తీసుకుంటామన్నారు.