రియల్ “బాహుబలి” : కేటిఆర్

SMTV Desk 2017-12-31 12:44:34  minister ktr, bahubali, elephant in the hole.

హైదరాబాద్, డిసెంబర్ 31 : బాహుబలి అనగానే మనకు గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఇప్పుడు మరో వ్యక్తిని తెలంగాణ ఐటి, పంచాయతి రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ వేదికగా “రియల్ బాహుబలి” అంటూ పొగిడేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే. అడవిలో ఓ ఏనుగు పిల్ల గుంతలో పడిపోవడంతో, దాని తల్లి అడవి సమీపంలోని రహదారిపైకి వచ్చి వీరంగం సృష్టించింది. దీంతో స్థానికులు ఆ తల్లి ఏనుగును అడవిలోకి తరుముతూ వెళ్తుంటే, గుంతలో పడిఉన్న ఏనుగుపిల్ల కనిపించడంతో, గార్డుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న గార్డు కుమార్ ఏనుగు పిల్లను గుంతనుంచి బయటకు తీసి, ఆసుపత్రి కి తరలించాడు. ఆహారం తినికుండా గుంతలో ఎంత కాలంగా ఉందో తెలియదు గాని నీరసంగా ఉండి నడవలేకపోయింది. అప్పడు గార్డ్ కుమార్ తన కంటే ఎంతో బరువున్న ఏనుగు పిల్లను భుజంపై ఎత్తుకొని ఆసుపత్రికి చేర్చాడు. కేటిఆర్ ట్విట్టర్ లో పై విధంగా స్పందిస్తూ ఆ ఫోటోను ట్విట్ చేశారు.