నిరుద్యోగ యువతకు తీపి కబురు..

SMTV Desk 2017-12-31 11:39:40  ts transco, jobs notification, npdcl, 3000 posts.

హైదరాబాద్, డిసెంబర్ 31 : నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇది వరకే విద్యుత్ శాఖ ట్రాన్స్‌కోలో 1,604 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఎస్పీడీసీఎల్‌(హైదరాబాద్‌)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది .ఇందులో150 ఏఈ(అసిస్టెంట్‌ ఇంజనీర్‌), 500 జూనియర్‌ అసిస్టెంట్‌, 100 జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(జేఏవో) పోస్టులు ఉండగా వీటితో పాటు మరో 2000జూనియర్ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టులు ఇందులో ఉన్నాయి. కాగా త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి పాలక మండలి ఆమోదం తీసుకోనున్నారు.