హెచ్‌ఐవీ సోకితే ఉద్యోగాలు ఇవ్వరా..? : హైకోర్టు

SMTV Desk 2017-12-29 12:45:30  Employment, HIV, AIDS, high court comments.

హైదరాబాద్, డిసెంబర్ 29 : హెచ్‌ఐవీ సోకిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎయిడ్స్ ఉందన్న కారణంగా ఇటీవల ఒక వ్యక్తికి డిపెండెంట్‌ ఎంప్లాయిమెంట్‌ కోటా కింద ఉద్యోగం ఇవ్వడం లేదని, అలా చేయడం సరికాదని స్పష్టం చేసింది. సింగరేణి కాలరీస్ అండర్‌గౌండ్‌లో పనిచేయడానికి ఆ వ్యక్తికి సరైన ఫిట్ నెస్ లేకపోతే అతనిని ఉపరితల పనిలోకి తీసుకో౦డి అంటూ తెలిపింది. ఈ విషయంపై కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు. మూడు నెలల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.