పెరిగిన ఆదాయపుపన్ను వసూళ్లు

SMTV Desk 2017-06-18 18:03:34  money, income tax, hiked, income tax department

ముంబయి, జూన్ 18: ఈ ఏడాది నికర ఆదాయపు పన్ను వసూళ్లలో గతేడాదితో పోలిస్తే 26.2 శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం జూన్‌ 15 నాటికి రూ. 80,075కోట్ల ఆదాయపు పన్ను వసూలు కాగా.. ఈ ఏడాది అదే సమయానికి రూ. 1,01,024 కోట్లు వసూలయ్యిందని ఆదాయపుశాఖ వెల్లడించింది. పన్ను వసూళ్లలో మెట్రో నగరాల్లో ముంబయి అత్యధికంగా 138శాతం వృద్ధిని నమోదుచేసింది. గతేడాది జూన్‌ 15 నాటికి ముంబయి జోన్‌లో రూ. 9,614కోట్లు వసూలుకాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య రూ. 22,884కోట్లకు చేరింది. ఇక దిల్లీలో 38శాతం వృద్ధి కనబడింది. గతేడాది రూ. 8,334కోట్లు ఆదాయపు పన్నులు చెల్లించగా.. ఈ ఏడాది రూ. 11,582 కోట్లకు పెరిగింది. కోల్‌కతాలో 7శాతం, బెంగళూరులో 6.8శాతం, పుణెలో 19శాతం, థానేలో 11శాతం వృద్ధి నమోదైంది. కాగా.. చెన్నైలో మాత్రం పన్ను వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. గతేడాది రూ. 8,986 కోట్లు వసూలు కాగా.. ఈ ఏడాది రూ. 8,591కోట్లకు పడిపోయిందని ఐటీశాఖ పేర్కొంది.