హైదరాబాద్, డిసెంబర్ 25: సర్వమానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండే కరుణామయుడు క్రీస్తు జన్మించిన రోజు నేడు. ఈ రోజు క్రైస్తవులందరూ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజు చాలా మంది ఇంట్లో క్రిస్మస్ చెట్టును అలంకరించి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. స్నేహితులు, బంధువులను ఇంటికి పిలిచి పార్టీలు ఇస్తుంటారు. ఇక సినీ తారల విషయానికీ వస్తే క్రిస్మస్ రోజు తెగ సందడి చేస్తారు. ఈ పండుగను పురస్కరించుకొని కొందరు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. # మీ మనసు, ఇల్లు సంతోషంతో నిండిపోవాలి. హ్యాపీ క్రిస్మస్ అండ్‌న్యూ ఇయర్: రమ్యకృష్ణ # అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు మీరే శాంతాక్లాజ్‌గా మారి మీ కలలు నెరవేర్చుకోండి: రకుల్ ప్రీత్ సింగ్ # మెర్రీ క్రిస్మస్. ఈ క్రిస్మస్‌తో మీ జీవితం ఆనంద క్షణాలతో వెలిగిపోవాలి: మంచు లక్ష్మి # అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను: సిమ్రన్ # ఈ క్రిస్మస్‌తో మీ జీవితం మరపురాని జ్ఞాపకాలతో నిండిపోవాలి: బెల్లంకొండ శ్రీనివాస్ # అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను: సాయి ధరమ్ తేజ్ # మెర్రీ క్రిస్మస్. మీ అందరికీ శాంతాక్లాజ్ కానుకలు ఇచ్చి ఉంటారని ఆశిస్తున్నాను. నాకు మరో వారంలో కానుక ఇస్తున్నారు. ఇంతకు మించి నేను ఏమీ అడగలేను: మంచు విష్ణు