భార్య, పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

SMTV Desk 2017-06-18 13:47:47  fathar, wife,son, daughters, poison

విజయవాడ, జూన్ 18 : ఒక తండ్రి తన భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన సంఘటన బెజవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ... బెజవాడలో నివాసం ఉంటున్న సురేష్ (30) అతని భార్య యశోద (29) వారికీ అమర్ (10) ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శనివారం అమర్ పుట్టిన రోజు సందర్భంగా రాత్రి వేడుకలను ఘనంగా జరిపారు. తరువాత అందురు వెళ్ళిపోయాక భార్య, ముగ్గురు పిల్లలు తినే అన్నంలో విషం కలిపి తినిపిచ్చాడు. అదే అన్నంను సురేష్ కూడా తిని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇలా కుటుంబం మొత్తం చనిపోవడానికి కారణం ఇంట్లో ఉన్న మనస్పర్ధలు రావడమేనని బంధువులు భావిస్తునారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.