ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్‌ వేడుకలు

SMTV Desk 2017-12-25 10:50:19  christmas celebrations, telangana, ap

హైదరాబాద్, డిసెంబర్ 25 : క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నగరంలోని ప్రముఖ చర్చిలు ఘనంగా మస్తాబైనాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని చర్చిలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గల చర్చిలు క్రైస్తవ సోదరులతో కిక్కిరిసిపోయాయి. క్రైస్తవులకు ప్రీతికరమైన పండుగ కావడంతో చర్చిలన్నీ విద్యుద్దీప కాంతులతో సుందరంగా వెలిగిపోతున్నాయి. నిన్న రాత్రి నుంచి క్రైస్తవులు పెద్దఎత్తున ప్రార్దన మందిరాలకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు, గీతాలతో క్రీస్తును కీర్తించారు. పాస్టర్ ప్రవచనాలతో ఈ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ వేడుకల్లో చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.