తెలుగు వారియర్స్ ఘన విజయం

SMTV Desk 2017-12-25 09:44:46  ccl t-10, telugu warriors, won, bengal tigers, uppal

హైదరాబాద్, డిసెంబర్ 24 : తెలుగు సినీ తారలు ఉప్పల్ స్టేడియం లో సిక్స్ లు మోత మోగించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీ-10 బ్లాస్ట్ టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టు బెంగాల్ టైగర్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగాల్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టులో ఉదయ్ ప్రతాప్ (42: 22 బంతుల్లో), యూసఫ్ (28: 19 బంతుల్లో) రాణించడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సచిన్ జోషి (53 నాటౌట్: 29 బంతుల్లో ), అఖిల్ అక్కినేని (43: 20 బంతుల్లో) మెరుపులు మెరిపించడంతో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలోనే చేధించింది. భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ ఓపెనర్ సచిన్ జోషి ఆరంభం నుంచి స్పీడ్ గా ఆడినా..అఖిల్ మాత్రం ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకి తరలించాడు. అఖిరిలో రన్ రేట్ పెరిగిపోవడంతో సారధి అఖిల్ ఒక్క సారి విశ్వరూపం చూపించాడు. విజయానికి 21 బంతుల్లో 42 పరుగులు అవసరమైన సమయంలో అఖిల్ అక్కినేని హ్యాట్రిక్ సిక్సర్లు బాదేసి ఒక్కసారికి మ్యాచ్‌ని తెలుగు వారియర్స్ వైపు తిప్పేశాడు. చివరిలో అఖిల్ ఔటైన, వైస్ కెప్టెన్ సచిన్ జోషి జట్టుకు విజయాన్ని అందించాడు.