టీ-10 బ్లాస్ట్ కు సర్వం సిద్దం

SMTV Desk 2017-12-24 11:55:34  ccl 10 blast, telugu warriors, akhil, #CCLT10BLAST

హైదరాబాద్, డిసెంబర్ 24 : ప్రముఖ భారత దేశ సినీ నటులు క్రికెట్ ఆటగాళ్లుగా మారి సినీ, క్రీడా ప్రేక్షకులను ఎంతోగానో అలరిస్తున్న సీసీఎల్ లీగ్ కొత్త ఫార్మాట్ వచ్చేసింది. సీసీఎల్ లో కొత్తగా ప్రవేశపెట్టిన నిర్ణిత 10 ఓవర్ల టీ-10 బ్లాస్ట్ ఈ రోజు, రేపు అలరించనుంది. మొత్తం 8 టీంలు పాల్గొనే ఈ టోర్నీలో తొలి పోరు ఈ రోజు 2.00 గంటలకు బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్ మధ్య జరగనుంది. తెలుగు వారియర్స్ జట్టు ఈ రోజు సాయంత్రం 6.30 నిముషాలకు బెంగాల్ టైగర్స్ తో తలపడనుంది. కాగా తెలుగు వారియర్స్ జట్టుకు అక్కినేని అఖిల్ నాయకత్వం వహించగా, ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ మెంటార్ గా ఉన్నారు. అంతే కాకుండా తెలుగు సినీచిత్ర హీరోయిన్లు రెజీనా, ప్రణీతా సుభాష్, అదాశర్మ, తెలుగు వారియర్స్ జట్టు కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్ లన్ని హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. షెడ్యూల్: 24 డిసెంబర్: *బెంగాల్ టైగర్స్ x చెన్నై రైనోస్ (2 to 4 pm) *కేరళ స్ట్రైకర్స్ x కర్ణాటక బుల్ డోజేర్స్ (4 to 6 pm) *తెలుగు వారియర్స్ xబెంగాల్ టైగర్స్ (6.30 to 8.30 pm) *ముంబాయి హీరోస్ xకేరళ స్ట్రైకర్స్ (8.30 to10.30 pm) 25 డిసెంబర్: *ముంబాయి హీరోస్ xకర్ణాటక బుల్ డోజేర్స్ (2 to 4 pm) *తెలుగు వారియర్స్ xచెన్నై రైనోస్ (4 to 6 pm) *ఫైనల్ (8.30 to 10.30)