డిసెంబర్ 31కి వస్తున్న ‘కొడకా.. కోటేశ్వరరావు’

SMTV Desk 2017-12-22 11:59:46  agnathavasi, song 31st released, pavankalyan singer, trivikram

హైదరాబాద్‌, డిసెంబర్ 22 : ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ పాడిన ‘కాటమరాయుడా కదిరీ నరసింహుడా’ పాటకు అభిమానులందరి కేరింతలతో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే, హారిక-హాసిని క్రియేషన్స్‌ పై నిర్మిస్తున్న ‘అజ్ఞాతవాసి’లో కూడా ‘కొడకా..కోటేశ్వరరావు’ అనే పాటను పవన్ స్వయంగా పాడారు. గురువారం ఈ పాట రికార్డింగ్‌ ముగిసినట్లు చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ పాటను న్యూఇయర్‌ సందర్భంగా డిసెంబర్‌ 31న విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ తెలిపారు. కాగా, కీర్తి సురేశ్‌, ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు.