చెన్నై, డిసెంబర్ 21 : హిట్ల మీద హిట్లు కొడుతున్న సాయిపల్లవి తాజాగా తమిళస్టార్ సూర్య సరసన నటించే అరుదైన అవకాశం కొట్టేసింది. గతంలో సూర్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన్ను కలిస్తే ఐ లవ్ యూ చెబుతానని చెప్పిన ఈ భామ, ఏకంగా ఆయనతో జోడీ కట్టబోతుంది. ప్రస్తుతం సూర్య 36వ సినిమాకు సాయిపల్లవి సంతకం చేశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్నారు. సాధారణంగా సూర్య సినిమాల్లో కథానాయిక పాత్రలు బలంగా ఉంటాయి. మరి ఇందులో సాయిపల్లవి ఎలా కనిపించబోతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. కాగా, నానితో జంటగా నటించిన ఎంసీఏ చిత్రం నేడు విడుదలై ప్రజాధారణ పొందుతుంది.