నిర్మాతగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌..?

SMTV Desk 2017-12-21 12:50:59  Stylish Star Allu Arjun, Producer, hyderabad

హైదరాబాద్‌, డిసెంబర్ 21 : స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌ ‘గీతా ఆర్ట్స్‌’ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తండ్రి బాటలోనే కొడుకు అల్లు అర్జున్ కుడా నిర్మాతగా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు టాలీవుడ్‌ టాక్. ఇకపై తీయబోయే సినిమాలను బన్నీ నిర్మాణ సంస్థపైనే నిర్మిస్తారని తెలుస్తోంది. త్వరలో అనూప్‌ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించబోయే చిత్రానికి నిర్మాతగా కూడా బన్ని వ్యవహరించే అవకాశం ఉందట. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా చిత్రీకరణ 2018 ఏప్రిల్‌లో మొదలవుతుందని వార్తలు వెలువడుతున్నాయి. త్వరలో ఈ విషయం గురించి అర్జున్‌ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అర్జున్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.