మరోసారి మాస్ రాజా తో రకుల్

SMTV Desk 2017-12-20 15:44:35  raviteja, rakulsing, new movie panned kalyankrishna

హైదరాబాద్, డిసెంబర్ 20 : ప్రస్తుతం ‘టచ్‌ చేసి చూడు’ షూటింగ్ లో బీజీ బీజీగా ఉన్న కథానాయకుడు రవితేజ, కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో మరో చిత్రానికి ఓకే చెప్పారు. ఇందులో రవితేజ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా ఎంపికైనట్టు తెలిసింది. కల్యాణ్‌కృష్ణ ఇది వరకు తీసిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ లోనూ కథానాయిక రకులే. అందులో ఆమె పాత్రకి మంచి పేరొచ్చింది. రవితేజ కోసం తయారు చేసిన కథలోనూ తన పాత్ర నచ్చడంతో రకుల్‌ ఈ సినిమా చేయడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం. ‘కిక్‌2 ’చిత్రం వీరికి విజయాన్ని అందించకపోయినా, ఈసారైన కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ జోడితో తీయబోయ్యే సినిమాకు విజయాన్ని సొంతం చేసుకొంటుందేమో చూడాలి మరి. ఈ చిత్రం షుటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు.